📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణభీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియామకం

భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియామకం

📰 Generate e-Paper Clip

భీమ్ ఆర్మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియామకం

జహీరాబాద్ సెప్టెంబరు 03(ప్రజాక్షేత్రం):భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సిద్దు రావణ్ నియమితులయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, జాతీయ అధ్యక్షులు వినయ్ రతన్ సింగ్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. తనను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందుకు భీమ్ ఆర్మీ జాతీయ నాయకత్వానికి సిద్దు రావణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కాన్షీరామ్ తదితర మహాపురుషుల ఆశయాల సాధన కోసం భీమ్ ఆర్మీ నిరంతరం పోరాడుతుందని అన్నారు. బహుజన రాజ్యాధికారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బహుజనుల అడ్డాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, రానున్న కాలంలో తెలంగాణను నీలి జెండా రాష్ట్రంగా మార్చే దిశగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని సిద్దు రావణ్ అన్నారు. తనపై నమ్మకంతో జాతీయ నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతను నమ్మకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణలో భీమ్ ఆర్మీని మరింత బలోపేతం చేసి, బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతామని సిద్దు రావణ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular