అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో “చందిప్ప”గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు.
- శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు అయినా చిన్నారులు
- భక్తి పారవశ్యంలో భక్తులు, మహిళామణులు.
శంకర్ పల్లి సెప్టెంబర్ 04(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కేంద్రంలోనీ చందిప్ప గ్రామంలో శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించారు. తమ తమ చిన్నారులను శ్రీ కృష్ణుడు గోపికమ్మ వేష ధారణలో ముస్తాబు చేసి భక్తి శ్రద్ధలో మునిగిపోయారు. శ్రీ కృష్ణా ఉట్టి కొట్టే ఉత్సవాలను వీధి వీధినా పిల్లలను శ్రీకృష్ణుడు, గోపికల వస్త్రధారణలతో ముస్తాబు చేసి ‘ఉట్టి కొట్టే’ (దహీ హాండి) వేడుకలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న, అటుకులు, చలిమిడి, సున్నిఉండలు, మరియు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించారు. కన్నయ్యకు 56 రకాల భోగ్లను (నైవేద్యాలను) సమర్పించి, వాటిపై తులసి దళాలను ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. అని ఈ పవిత్ర పర్వ దినం రోజున భాగవతంలోని దశమ స్కంధాన్ని పారాయణం చేయడం, అష్టోత్తర శతనామ మరియు సహస్రనామ పూజలు చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో భాగంగా చందిప్ప గ్రామ సర్పంచ్ మాధోల్ల మల్లికార్జున్ ఉప సర్పంచ్ లింగంపల్లి లక్ష్మీ నర్సింలు వార్డు సభ్యులు సురేష్, అనంతయ్య శ్రీరామ్, బాల్ రాజు, అనంత్ రాఘవెందర్ గౌడ్, సబిత రవి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

