📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణజర్నలిస్టుల సేవలు అభినందనీయం

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

📰 Generate e-Paper Clip

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

  • మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి ఘన సన్మానం

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):జర్నలిస్ట్ డే సందర్భంగా మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులను ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాదె నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు, ప్రజా సమస్యలు, అభివృద్ధి లోపాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి నిష్పక్షపాతంగా వార్తలను అందిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న జర్నలిస్టులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. జర్నలిస్ట్ డే సందర్భంగా మీడియా ప్రతినిధులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా జర్నలిస్టులు మరింత బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని గాదె నర్సిరెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మన భద్రాద్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular