సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలి
- మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు
వలిగొండ, అక్టోబర్ 17(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా వలిగొండ మండల ప్రజలకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారని అన్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరిస్తూ, ప్రశాంత వాతావరణంలో సద్దుల బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

