Homeతెలంగాణముళ్లపొదల్లో హన్మాపూర్ బస్‌ షెల్టర్‌!

ముళ్లపొదల్లో హన్మాపూర్ బస్‌ షెల్టర్‌!

📰 Generate e-Paper Clip

ముళ్లపొదల్లో హన్మాపూర్ బస్‌ షెల్టర్‌!

  • ప్రయాణికులకు తప్పని అవస్థలు.. పట్టించుకోని అధికారులు

పెద్దేముల్, అక్టోబర్ 21 (ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని హన్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న బస్‌ షెల్టర్‌ నిర్వహణ లోపంతో అధ్వానంగా మారింది.బస్‌ షెల్టర్‌ చుట్టూ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి కప్పేయడంతో కనీసం అక్కడ బస్‌ షెల్టర్‌ ఉన్నట్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రతిరోజూ వివిధ గ్రామాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు సౌకర్యవంతమైన వసతి కల్పించాల్సిన బస్‌ షెల్టర్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారుతోంది.చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడంతో ప్రయాణికులు అక్కడ నిలబడేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో అవస్థలకు గురవుతున్నారు.ప్రజల రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన బస్‌ షెల్టర్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. హన్మాపూర్ బస్‌ షెల్టర్‌ చుట్టూ పెరిగిన ముళ్లపొదలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేయించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించి హన్మాపూర్ బస్‌ షెల్టర్‌ చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్‌ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular