తెలంగాణ సచివాలయంలో ప్రముఖుల ఆత్మీయ కలయిక
- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఛాంబర్లో వివిధ రంగాల ప్రముఖుల సమాగమం
హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణ సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఛాంబర్లో పలువురు ప్రముఖులు ఆత్మీయంగా కలుసుకున్నారు. వివిధ సామాజిక, రాజకీయ, విద్యా రంగాలకు చెందిన ప్రముఖుల కలయిక స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ ఆత్మీయ కలయికలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య, ఐఆర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు. జై భీమ్ టీవీ ఫౌండర్ & చైర్మన్, ప్రజాదరణ పార్టీ వ్యవస్థాపకులు డా. బరిగెల శివ సైతం ఈ ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పరస్పరం పలకరించుకుని ఆత్మీయంగా సంభాషించుకున్నారు. వివిధ రంగాల్లో ప్రజా జీవితంతో అనుబంధం కలిగిన నాయకులు ఒకే చోట కలుసుకోవడం ఈ సమావేశానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. సామాజిక చైతన్యం, ప్రజా సమస్యలు, ప్రజాసేవ వంటి అంశాలపై తమ తమ రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖుల ఈ కలయిక స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.


