Homeక్రైమ్ న్యూస్విద్యుత్ షాక్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

విద్యుత్ షాక్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

📰 Generate e-Paper Clip

మొయినాబాద్ అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామ పరిధిలోని ఒక పొలం దగ్గర కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో పెట్రోల్ విని పారిపోవాలని పరిగెత్తడం జరిగింది. పక్కనే ఉన్న వరి చేను పొలం సర్వే నంబర్లు, 330 లో వరి పొలాన్ని పందులు అడవి పందులు పాడు చేస్తున్నాయనిపంతో రైతు చేను చుట్టూ విద్యుత్ తీగలను అమర్చడం జరిగింది విద్యుత్ తీగల తగిలి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మోక్ష సాయి చరణ్ (20) బిటెక్ సివిల్ థర్డ్ ఇయర్ సివిల్ అత్తాపూర్ హైదరాబాద్. యశ్వంత్ (20) బీటెక్ థర్డ్ ఇయర్ సివిల్ హేఫిజ్ పెట్ హైదరాబాద్, రాజిరెడ్డి అనే రైతుకు చెందిన సుమారు అర ఎకరం వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లు సమాచారం. పంటలను అడవి పందుల నుంచి రక్షించేందుకు పొలం చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇంకా పూర్తిగా విద్యార్థుల వివరాలుతెలియాల్సి ఉంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular