Homeతెలంగాణమరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి!

మరో రెండు రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో కాబోయే పెళ్లికొడుకు మృతి!

📰 Generate e-Paper Clip

వికారాబాద్ నవంబర్ 15(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం తుంకిమెట్ల-కోస్గి మార్గంలో కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో లగచర్లకు చెందిన శ్రీశైలం ఉన్నారు. ఆయనకు మరో రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కొడంగల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular