📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రశ్నించే ప్రజా గొంతుక ప్రజాక్షేత్రం

ప్రశ్నించే ప్రజా గొంతుక ప్రజాక్షేత్రం

📰 Generate e-Paper Clip

– పేద ప్రజలకు చేయూతనివ్వాలి.

– ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి.

– తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

హైదరాబాద్, జనవరి 23(ప్రజాక్షేత్రం):ప్రజలకు ప్రభుత్వానికి మధ్యల పత్రికలు వారధిగా ఉండాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను మినిస్టర్ కొట్రస్ వారి చేతుల మీదుగా శుక్రవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… కులమతాలకు అతీతంగా పేదవారికి సేవ చేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని కోరారు. మారుమూల ప్రాంతాల నుండి కార్యాలయానికి చేరుకోలేని పేదవారు వారియొక్క సమస్యలు తెలుపుకునేంత చైతన్యవంతం కూడా లేని పేద ప్రజల పక్షాన ప్రజాక్షేత్రం నిలబడాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామలపై ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగానికి వారిధిగా ప్రజాక్షేత్రం ప్రతినిధులు పనిచేయాలని పత్రిక ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్, నామ నంద కుమార్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular