📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సూట్‌కేస్‌ కలకలం

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సూట్‌కేస్‌ కలకలం

 

సికింద్రాబాద్‌, జనవరి 25(ప్రజాక్షేత్రం):సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1పై అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేస్‌ కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, బాంబ్‌ స్క్వాడ్‌ సూట్‌కేస్‌ను జాగ్రత్తగా తెరిచి పరిశీలించారు. పరిశీలనలో సూట్‌కేస్‌లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని తేలింది. దీంతో పోలీసులు, ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించినందుకు ప్రయాణికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular