📄 ePaper
Saturday, June 13, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణదళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష

దళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష

📰 Generate e-Paper Clip

దళితుల గుడి దారిలో చిచ్చురేపిన కుల వివక్ష

  • దళితుల పోచమ్మగుడిదారికి అడ్డంపడిన బీసీలు
  • మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి మూలం
  • నాలుగు రోజులుగా చల్లారని దారి వివాదం
  • సమస్య సామరస్యానికి అధికారులప్రయత్నం విఫలం
  • ఎమ్మార్వో పక్షపాత వైఖరి అవలంభించారన్న దళితులు
  • చివరికి దళిత దేవుళ్ళకూ.. తప్పని కులవివక్ష
  • దళితులకు న్యాయం చెయ్యాలంటూ అంబేద్కర్ సంఘాల డిమాండ్

చేవెళ్ల, ఫ్రిబవరి 01(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలపరిధిలోని నాగరగూడ గ్రామపంచాయతీ సర్వేనెంబర్ 277లో దేవుడి గుడికి దారి వివాదంలో కులవివక్ష అగ్గిరాజేషింది. రెండు వర్గాలమధ్య నాలుగు రోజులుగా వివాదం కులచిచ్చు రేపుతుంది. తమకు న్యాయం చెయ్యాలని దళితులు ప్రజాసంఘాలు, కులసంఘాలతో కలిసి ఎమ్మార్వో, ఆర్డివోలకు పిర్యాదు చేశారు. ఈ వివాదం చిలిగి చిలిగి గాలివానలా పెరిగి పెద్దదయ్యింది. (నాగరగూడ మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి దారి తీసింది. జైలుకైనా వెళ్తాను కాని వారికీ దారి వదలమని క్రిష్ణ గౌడ్ మాటలు మరింత చిచ్చు రేపాయి. దళితులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని అని వికృత మాటలు దళితుల మనోభావాలను
దెబ్బతీసేలా మారాయి. దీంతో మాపై ఇంకా కుల వివక్ష కొనసాగుతుందని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు.అధికారుల ముందు మారని క్రిష్ణ గౌడ్ తీరు.
ఒకానొక దశలో మాజీ సర్పంచి క్రిష్ణ గౌడ్ మాటలకూ సీఐ కాంతరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు). మీరు ఇలాగే మాట్లాడితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు కలిగిస్తే ఎవ్వరినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

  • ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనా ?

రానున్న రోజుల్లో స్మశానవాటికలకు భూమి సరిపోదనే ఉద్దేశ్యంతో కోట్లరుపాయలతో అన్నివర్గాల ప్రజల అవసరనిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి స్మశానవాటిక అభివృద్ధి చేసింది. కాని గ్రామాలలో వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే తరహాలో నాగరగూడ గ్రామపంచాయతిలో సర్వేనెంబర్ 277 లో కొనసాగుతున్న దారి గొడవ. పురాణ స్మశానవాటికలోనే బీసీలు సమాధులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కేటాయించిన స్మశానవాటిక దళితులకేనన్న భావనకు నాంది పలుకుతుంది, ప్రజల మధ్య కులాల మధ్య కులవిబేదాలకు తావిస్తుంది.

  • మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి కారణం .

నాగరగూడ మాజీ సర్పంచ్ క్రిష్ణ గౌడ్ ప్రోద్బలమే వివాదానికి దారి తీసింది.( జైలుకైనా వెళ్తాను కాని వారికీ దారి వదలమని క్రిష్ణ గౌడ్ మాటలు మరింత చిచ్చురేపాయి. (దళితులు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని కులంతో కలిపి చేసిన వికృత మాటలు దళితుల మనోభావాలను
దెబ్బతీసేలా మారాయి). సర్వేనెంబర్ 277 లో ఉన్న సమాధులకు అదే సర్వేనెంబర్ లో సమాధులకు ఆనుకుని దళితులు తాతముత్తాతలు నిర్మించిన పోచమ్మ గుడి ఉంది.ఈ గుడికి సమీపంలో అగ్రవర్ణాల గుడి ఉంది. ప్రతి సంవత్సరం పండగలు, పూజలు కార్యక్రమాలు నిర్వహించుకునే క్రమములో అందరు బోనాలు ఓకే దారిగుండా వెళ్ళాల్సిన క్రమంలో బీసీ పెద్దలు, మా బోనాలు ముగిసిన తరువాతే దళితులు నిర్వహించుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. ఈ క్రమంలో దళితులపై కులవివక్ష కొనసాగుతుండటంతో దళితులు మాకు మరోదారి కావాలని సర్వేనెంబర్ 277 లో ఉన్న పురాతన స్మశానవాటికలో కాళీ స్థలం నుండి పోచమ్మ దేవాలయానికి దారిచేసుకుని నడుస్తున్నారు. ఇదిలా కొనసాగుతున్న క్రమంలో నాగర్ గూడ మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ ప్రోద్బలంతోనే బీసీలు, దళితుల దారికి అడ్డంపడుతున్నారని ఆరోపించారు. మూడు రోజుల క్రితం గురువారం రోజుల క్రితం బీసీవర్గం

  • అధికారుల ప్రయత్నం విఫలం .

దీంతో శనివారం రెండువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అధికారుల ప్రయత్నం చేశారు.
వివాదం లేకుండా సమస్య పరిష్కరించుకోవాలని ఎమ్మార్వో అన్వర్, షాబాద్ సీఐ కాంతరెడ్డి సూచించారు. ఎవరైనా కులవివక్ష చూపితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇరువర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
షాబాద్ ఎమ్మార్వో అన్వర్, దళితులు వేసుకున్న దారికి ప్రత్యామ్నాయంగా మరో దిక్కు దారి కల్పిస్తామన్నా మాటలకు దళితులను వేరుచేసే వైఖరి అవలంబిస్తున్నారని, ముందునుండి బీసీలు చేస్తున్న వాదననే వారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మార్వో ఇక్కడ చదివారని, ఎమ్మార్వో అన్వర్ మాటలు బీసీలకే అనుకూలంగా ఉన్నాయని దళిత సంఘాలు మండిపడ్డాయి.

  • ఎమ్మార్వో వైఖరిపై మండిపడ్డ దళిత సంఘాలు ఎమ్మార్వో అన్వర్ మాట్లాడుతూ ఈ స్థలం గ్రేవార్డుకు సంబంధించిందని, ఇక్కడ దారి ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పారు. ఊరికి స్మశానవాటిక ఉందికదా మరొక్కటి ఎందుకని దళితసంఘం నాయకులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. నాగరగూడ గ్రామం భవిష్యత్తులో మున్సిపాలిటీ ఏరియా కాబోతుందని ఫిజికల్ గ్రేవార్డులను పెరిగే అవకాశం ఉందని అన్నారు. దళితులకు ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు. దళితులు వేసుకున్న దారికి ప్రత్యామ్నాయంగా పక్కనుండి దారి కల్పిస్తామని అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను లిప్ట్ చెయ్యాలని విద్యుత్ ఏఈకి ఫోన్ చేసి మాట్లాడారు. అయినా దళితులు ఒప్పుకోలేదు తరతరాలుగా నాగరగూడలో దళితులపై కులవివక్ష సాగుతుందని, ఎమ్మార్వో అన్వర్ మరో దిక్కు దారి కల్పిస్తామన్నా మాటలు దళితులను వేరుచేసే వైఖరి అవలంబిస్తున్నారని, ముందునుండి బీసీలు చేస్తున్న వాదనను,అక్కడ వారు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మార్వో ఇక్కడ చదివారని, ఎమ్మార్వో అన్వర్ మాటలు బీసీలకే అనుకూలంగా ఉన్నాయని దళిత సంఘాలు మండిపడ్డాయి. చివరికి దళిత దేవుళ్ళపై కూడా కుల వివక్ష జరుతుందని .. ఆందోళన చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని దళితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బేగరి యాదయ్య, దుర్గేష్, పెంటయ్య, గోపాల్, క్రిష్ణ, ప్రవీణ్, బాలరాజ్, క్రాంతికుమార్, చందు, రమేష్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ బేగరి మహేష్, నరేందర్, జైపాల్, శ్రీనివాస్, రామకృష్ణ, సుధాకర్, శేఖర్, రాజు, నర్సిములు, అంజయ్య, రాంచంద్రయ్య, నందు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login