తెలంగాణ డిజిపి సివి ఆనంద్ ను కలిసిన మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ జూన్ 11(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించిన సివి. ఆనంద్ ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హైదరాబాద్ లోని డిజిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి సీవీ ఆనంద్ కు మంద కృష్ణ మాదిగ పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. గతంలో ఎమ్మార్పీఎస్ తొలి దశ ఉద్యమ సమయంలో బషీర్ బాగ్ చౌరస్తాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించిన విషయాలను సివి ఆనంద్ గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో విశేష అనుభవం కలిగిన సివి ఆనంద్ తెలంగాణ రాష్ట్ర డిజిపి గా నియమితులవడం సంతోషకరమని మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నేత తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ, ప్రముఖ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, సినీ దర్శకులు ప్రేమ్ రాజ్, ఎంఎస్ఎఫ్ నేత బైరపోగు శివ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

