మామూళ్ల మత్తులో చేవెళ్ల ఎక్సైజ్ అధికారులు
- రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపుల దంద
- జోరుగా కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు.
- ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా బెల్టు షాపుల కలెక్షన్ జోరు.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 12(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ, తాళ్లపల్లి, లక్ష్మారావు కూడా, తిమ్మారెడ్డి గూడ, మక్తగూడ, దోస్వాడ, పోతుగల్, తదితర గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నప్పటికీ అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారు. దీంతో ఈ గ్రామాలపై కన్నెత్తి చూపడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలు ఉదయం నుంచి మందు అధిక రేట్లకు విక్రయిస్తున్నప్పటికీ త్రాగడం మాత్రం మానుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నప్పటికీ మందు విక్రాయాల్లో అధిక రేట్లకు అమ్ముతున్నప్పటికీ బెల్ట్ షాప్ దారులు రెండు చేతులు సంపాదిస్తున్నారు. ఇంత తతంగం జరిగినప్పటికీ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే బెల్ట్ షాపుల దందా తగ్గే అవకాశం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఎక్సైజ్ అధికారులపై మండిపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మే బెల్ట్ మద్యం కిరాణా షాపులను అడ్డుపెట్టుకొని మద్యం అధిక రేట్లుకు అమ్ముతున్నప్పటికీ వారిని అడిగే నాధుడే లేడని దీంతో మద్యం అమ్మే వ్యాపారులు వారి ఇష్టారాజంగా కల్తీ మద్యం అమ్ముతూ రెండు చేతుల డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి బెల్ట్ షాపుల పై దాడులు నిర్వహించి బెల్ట్ షాపులను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

