📄 ePaper
Wednesday, June 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపొద్దుటూరు గ్రామ ప్రజలకు ఉచిత ఆటో సర్వీస్

పొద్దుటూరు గ్రామ ప్రజలకు ఉచిత ఆటో సర్వీస్

📰 Generate e-Paper Clip

పొద్దుటూరు గ్రామ ప్రజలకు ఉచిత ఆటో సర్వీస్

 

– గ్రామ ప్రజల సేవలో దూసుకుపోతున్న సర్పంచ్ బండ లక్ష్మీ నర్సింహా

– అభినందించిన బొల్లారం వెంకట్ రెడ్డి, కె శ్రీనివాస్, ఏనుగు నర్సింహా రెడ్డి

– హర్షం వ్యక్తం చేస్తున్న ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు

శంకర్ పల్లి ఫిబ్రవరి 09(ప్రజాక్షేత్రం):ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు గ్రామం నుంచి గేటు వరకు వెళ్లేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉచిత ఆటో సేవల కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రస్తుత గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి ఈ అంశాన్ని తన భర్త, ప్రొద్దుటూరు గ్రామ మాజీ ఉపసర్పంచ్ బండ నర్సింహా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బండ నర్సింహా సహోదరుడు బండ బాలయ్య రిబ్బన్ కటింగ్ చేయగా గ్రామ పెద్దలు కొబ్బరికాయలు కొట్టి ఆధ్యాత్మిక అభినందనలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, ప్రొద్దుటూరు నుంచి మొదటి ట్రిప్ ప్రారంభమైంది, ఇందులో శంకర్‌పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి ఆటోను నడిపిస్తూ, ప్రొద్దుటూరు మాజీ సర్పంచ్‌లు ఏనుగు నరసింహారెడ్డి, కే శ్రీనివాస్, మాజీ కో–ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి, ఇతర ప్రముఖులను ఆటోలో కూర్చోబెట్టుకొని మొదటి ట్రిప్పు పూర్తి చేసి నిర్వాహకులను అభినందించారు. గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ బండ ముత్తమ్మ, బండ మల్లయ్య గార్ల జ్ఞాపకార్థం వారి పవిత్ర స్మృతికి అంకితంగా ఈ ఉచిత ఆటో సేవలను ప్రారంభించిన బండ నర్సింహా, గ్రామం నుంచి ప్రొద్దుటూరు గేటు వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత ఆటో సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించామని, భవిష్యత్తులో కూడా గ్రామానికి ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రొద్దుటూరు గ్రామ ప్రజలకు అందిస్తున్న ఉచిత ఆటో సర్వీస్ సేవలపై శంకర్‌పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ సర్పంచ్‌లు ఏనుగు నరసింహారెడ్డి మరియు కె శ్రీనివాస్ లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. బండ లక్ష్మీ నరసింహా ప్రజల కోసం చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి ప్రజాసేవ భవిష్యత్తులో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సేవ ద్వారా గ్రామస్తులు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే అవకాశం పొందుతుండటం, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు మరియు అనారోగ్యంతో బాధపడే ప్రజలకు సహాయం కలిగడం వంటి ఫలితాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ సర్పంచ్‌లు ఏనుగు నరసింహారెడ్డి, కె శ్రీనివాస్, ప్రొద్దుటూరు గ్రామ డిప్యూటీ సర్పంచ్ కవేలి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సురకంటి మల్లారెడ్డి, పిఎసిఎస్ శంకర్‌పల్లి బోర్డు మాజీ డైరెక్టర్ బొల్లారం మోహన్ రెడ్డి, 2వ వార్డు మెంబర్ ఏనుగు నరేందర్ రెడ్డి, 4వ వార్డు మెంబర్ ఉమ్మెంతల శ్వేత వినోద్ కుమార్, 5వ వార్డు మెంబర్ కోటె ప్రశాంత్, 6వ వార్డు మెంబర్ ఎనికే పల్లి మాధవ్ 7వ వార్డు మెంబర్ బేగరి సింహం రాజు, 8వ వార్డు మెంబర్ బూడుదల సునీత శ్రీనివాస్, 9వ వార్డు మెంబర్ కొలన్ రమాదేవి, 10వ వార్డు మెంబర్ కవేలి తిరుపతి రెడ్డి, పెద్దలు మాజీ కో–ఆప్షన్ సభ్యులు కవేలి జంగారెడ్డి, పులకండ్ల రఘుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, బండ బాలయ్య, మాజీ వార్డు సభ్యులు నాని రత్నం, దర్ని కృష్ణ, పులకండ్ల గోపాల్ రెడ్డి, కవేలి యాదిరెడ్డి, ఏనుగు చెన్నారెడ్డి, ఏనుగు గోవర్ధన్ రెడ్డి, క్రాంతి యూత్ ప్రెసిడెంట్ బి నవీన్ కుమార్,బేగరి గోపాల్, మందు మూల యాదయ్య, ఎం. విజయ్ కుమార్, నాని మల్లేష్, మందు మూల శ్రీనివాస్, నక్క వెంకటేష్, గ్రామ యువత మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login