📄 ePaper
Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ.

మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ.

📰 Generate e-Paper Clip

మల్లాపూర్‌లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భూమిపూజ.

  • రూ.1.8 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం.
  • ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచాలి.
  • పేదరికం తెలిసినవారే ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు – ఈటల                                మల్లాపూర్ ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కొత్త భవన నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రూ.1.8 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాన్ని “టెక్నిప్ ఎఫ్‌ఎంసి సంస్థ”, అమలు భాగస్వామి “హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా” ఆధ్వర్యంలో చేపడుతున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక మాజీ కార్పొరేటర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి సంస్థ అందిస్తున్న సహకారం అభినందనీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు..ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కష్టం తెలియని వారు అధికారులైతే మానవతా దృక్పథం లోపిస్తుందని అన్నారు. పేదరికం నుంచి వచ్చినవారికి కష్టం–సుఖం తెలిసి ప్రజల సమస్యలు అర్థమవుతాయని, అందువల్ల వారు సేవాభావంతో పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారని, వాటి అభివృద్ధికి అందరూ కృషి చేయాలని సూచించారు. బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సంస్థలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లే తాను కూడా పేద విద్యార్థులకు, ముఖ్యంగా వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నానని తెలిపారు. విద్యాభివృద్ధి కోసం ప్రజలు, సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్త భవనంతో విద్యార్థులకు మెరుగైన వాతావరణంలో విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login