📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
Homeతెలంగాణమాయమవుతున్న పార్క్ స్థలాన్ని కాపాడండి

మాయమవుతున్న పార్క్ స్థలాన్ని కాపాడండి

📰 Generate e-Paper Clip

మాయమవుతున్న పార్క్ స్థలాన్ని కాపాడండి

  • ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి

రాజేంద్రనగర్, మార్చి 28(ప్రజాక్షేత్రం):రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్ మైలార్దేవ్ పల్లి కాటేదాన్, టి ఎన్ జి ఎస్ కాలనీ పరిధిలోని సర్వే నంబర్ 156/1/2 గత లేఔట్ ప్రకారం సుమారు 1200 గజాల స్థలం మట్టి పోసి మాయమైపోతున్న పార్కు స్థలాన్ని కబ్జా కోరల నుంచి కాపాడాలని ఏఐటియుసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు. కానీ దాన్ని మట్టి పోసి కొందరు పార్కు స్థలం లేకుండానే చేయాలని చూస్తున్నారు. హైడ్రా, జిహెచ్ఎంసి అధికారులు పార్కు స్థలాన్ని కాపాడాలి ఆ యొక్క పార్కు స్థలం సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఉంటుందని కాలనీ స్థానిక ప్రజలు కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా, జిహెచ్ఎంసి అధికారులు తగిన చర్యలు తీసుకోని పార్కు స్థలాన్ని కాపాడాలని, పార్కుకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular