📄 ePaper
Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

📰 Generate e-Paper Clip

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్.

పినపాక మార్చి 23(ప్రజాక్షేత్రం):ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్‌లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు.జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు:

ఇల్లందు మండలం తిలక్‌నగర్ గ్రామపంచాయతీకి చెందిన ఎట్టి కౌసల్య గత 20 సంవత్సరాలుగా రొంపేడు గ్రామ పరిధిలోని సర్వే నెం. 588/15/2లో ఉన్న 5 ఎకరాలు 07 గుంటల వారసత్వ వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం ప్రకారం పాస్‌బుక్ కోసం రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తన పేరు రెవెన్యూ రికార్డులో నమోదు కాలేదని, ఎలాంటి ఉత్తర్వులు అందలేదని పేర్కొంటూ పాస్‌బుక్ మంజూరు చేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం ధరణి ఆపరేటర్‌కు ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన కాటిబోయిన సూర్యకుమారి తమ కుటుంబం నిరుపేదదని, తమ కుమార్తె ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడంలో అవగాహన లోపంతో అవకాశం కోల్పోయినట్లు తెలిపారు. తమ కుమార్తెకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశం కల్పించాలని కోరగా, దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం సంబంధిత డి-సెక్షన్‌కు ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం రొంపేడు గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి (ఎం.ఏ., బి.ఎడ్) పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం లభించలేదని, తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు రైతులు బోరు మరియు విద్యుత్ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేయగా, దానిని పరిశీలించి తగు చర్యల నిమిత్తం ఐటీడీఏ పీవోకు ఎండార్స్ చేశారు. మణుగూరు మండలం కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన మామిడి నాగేశ్వరరావు సింగరేణి ఓపెన్‌కాస్ట్ సేకరణలో ఇల్లు కోల్పోయినట్లు తెలిపారు. ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఎస్.ఈ.ఎస్ (SES) నెంబర్ తప్పుగా నమోదైనట్లు పేర్కొంటూ దానిని సరిచేయాలని కోరారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల కోసం భద్రాచలం సబ్ కలెక్టర్‌కు ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login