📄 ePaper
Sunday, May 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణమాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం

మొయినాబాద్ మార్చి 14(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ రంగంలోకి దిగి ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టింది. పోలీసుల సోదాల్లో ఫామ్ హౌస్‌లో భారీగా కొకైన్ , ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రజాప్రతినిధి సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాటు, పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుబడిన వీఐపీలు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరాసరఫరా అయ్యాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పార్టీలో ఉత్తరాది ఎమ్మెల్యే, ఎపికి చెందిన ఎంపితో సహా ఎనిమిది మంది విఐపిలు ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

https://man2bantul.id/https://portal.man2bantul.id/https://sirekap.man2bantul.id/https://eptsp.man2bantul.id/https://smkn5balam.com/https://tuluskartika.or.id/https://smptk.tuluskartika.or.id/https://www.stai-nurulhidayah.ac.id/https://journal.stai-nurulhidayah.ac.id/https://ejurnal.stai-nurulhidayah.ac.id/https://tical2025.redclara.net/https://uptdselatan.com/masterpoker99masterpoker99masterpoker99poker757poker757
masterpoker99masterpoker99masterpoker99masterpoker99inifun88inifun88inifun88https://jrdindustry.com/inifun88inifun88inifun88inifun88inifun88vovo88vovo88vovo88vovo88vovo88
inifun88inifun 88inifun88 logininipokerini pokerinipoker loginvovo88vovo88vovo88vovo88inifun88inifun88inifun88vovo88itudewaitudewaitudewa loginitudewa loginitugolitugolitugol loginitugol login