📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరింది - భీమ్ భరత్

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరింది – భీమ్ భరత్

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరింది – భీమ్ భరత్

నవాబ్ పేట ఏప్రిల్ 01(ప్రజాక్షేత్రం):నవాబ్ పెట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని బుధవారం ఘనంగా ప్రారంభించిన చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడైనా ఏనాడైనా పేదల పక్షాన ఉంటుందని పేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను మంజూరు చేస్తూ పేదల పక్షాన దేవునిలా నిలబడి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పెట్ మండలం అధ్యక్షులు వెంకటయ్య గారు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు పోలీస్ మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular