📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణజీవీకే భూకబ్జా ఆరోపణల బ్యానర్లు కలకలం

జీవీకే భూకబ్జా ఆరోపణల బ్యానర్లు కలకలం

📰 Generate e-Paper Clip

శంకర్ పల్లి జూన్ 16(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్, మొకిల తాండ గ్రామాల సరిహద్దులో సోమవారం ఉదయం మొకిలా తండా గ్రామస్థులు ఏర్పాటు చేసిన బ్యానర్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. జీవీకే కంపెనీ రైతుల 30 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేసుకుందని, ఆ భూమిని వెంటనే రైతులకు తిరిగి అప్పగించాలని బ్యానర్లలో పేర్కొన్నారు. బ్యానర్లపై సంబంధిత సర్వే నంబర్లను కూడా ప్రస్తావించడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం బ్యానర్లు కనిపించడంతో ఆ ప్రాంతంలో కొంత కలకలం నెలకొంది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి వాస్తవాలను వెలికితీయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular