హైదరాబాద్ జూన్ 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపాల కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. గత రెండు రోజులుగా ప్రధాన సర్వర్లు మొరాయించడంతో భూములు, ఇళ్లు, ఆస్తుల బదలాయింపులు స్తంభించిపోయాయి. ఇది గత మూడు నెలల్లో నాలుగోసారి కావడంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుకింగ్, చలాన్ చెల్లింపులు, ఈ-కేవైసీ వంటి ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం సర్వర్లను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు
0
15
Previous article
Next article

