దేవరకద్రలో గాలి బీభత్సం..బొలెరోపై గోడ కూలి ఇద్దరు మృతి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూన్ 17(ప్రజాక్షేత్రం):దేవరకద్రలో గాలి బీభత్సం సృష్టించింది. కాసేపటి క్రితమే ప్రారంభమైన వడగండ్ల వాన అల్లకల్లోలం చేసింది. ఈ క్రమంలో బొలెరోపై గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న ఇంటి పక్కన బొలెరో వాహనం పార్క్ చేయగా, రెండు అంతస్తులపై నుంచి గాలికి గోడ కూప్పకూలింది. దీంతో ఆ బొలెరో వాహనం తుక్కుతుక్కు కాగా, ఇద్దరు వ్యక్తులు అందులోనే ఇరుక్కుపోయారు. అయితే, స్థానికులు, పోలీసులు కష్టపడి ఆ వ్యక్తులను బయటకు తీశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు మృతి చెందారు. దీంతో దేవరకద్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు భారత్ మాల రోడ్డుకు సంబంధించిన సిబ్బందిగా గుర్తించారు.

