నాగర్ గూడ శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ షాపు ను మూసివేయండి
- అధిక రేట్లకు విక్రయిస్తున్న మందులు.
- మెడికల్ షాపులను తరిఖీ చేయాల్సిన అధికారులు లేకపోవడం వల్లే ఆగని తతంగం.
- నా మెడికల్ షాప్ లో అధిక ధరలకు మందులు అమ్ముతున్న అది నా ఇష్టం అంటున్న యజమాని
- లైసెన్స్ వేరే వారి పేరిట నడుపుతూ కాలం చెల్లిన మందులను అమ్ముతున్న బాగోతం
- బి ఫార్మసీ చదవని వ్యక్తిచే అధిక ధరలకు మందుల విక్రయం.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జూన్ 17(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన గల శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో అధిక రేట్లకు మందులు విక్రయిస్తూ దాంతోపాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ లో బిఫార్మర్స్ చేయని వ్యక్తిచే మెడికల్ షాప్ లో అధిక ధరలకు మందులు విక్రయిస్తూ దీంతోపాటు కాలం చెల్లిన మందులు కూడా విక్రయిస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగడం మాడుతున్న యజమాని పై తగిన చర్యలు తీసుకోవాలని నాగర్ గూడ దాని మారుమూల గ్రామాల ప్రజలు మెడికల్ షాపులను తనిఖీ చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. ఇంతవరకు కాలం తీరిన మందులు వేసుకున్న రోగులు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన దాఖలు కూడా ఉన్నాయని రోగులు బోరున విలపిస్తున్నార. యజమానికి చదువు రాకుండా మందుల గురించి తెలియకుండా బీఫార్మసీ చేయని వ్యక్తి చే మందులను రోగులకు విక్రయిస్తూ తన సంపాదన గురించి పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న మెడికల్ షాప్ యజమానిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మెడికల్ షాపు ను మూసివేయాలని కోరుతున్నారు.
చదువు రాని మెడికల్ షాప్ యజమాని.?
ఎంతో కొంత చదువు తన సంపాదన కోసం లైసెన్స్ కలిగిన వ్యక్తి దగ్గర డబ్బులు కట్టి లైసెన్స్ దారుడు పేరిట మెడికల్ షాపులు పెట్టి షాపులో బీఫార్మన్స్ చేయని వ్యక్తిచే మందులను అధిక రేట్లకు రోగులకు అమ్మి రెండు చేతుల సంపాదిస్తున్నా ఈ యజమానిపై తగిన చర్యలు తీసుకుని పేద ప్రజల ప్రాణాలు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డాక్టర్ లేకున్నా నేరుగానే మందులు.?
పేద ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే ఒక ఎంబిబిఎస్ డాక్టర్ ఉండాల్సింది పోయి రోగి తనకు ఈ సమస్య వచ్చిందంటే శ్రీ లక్ష్మీనరసింహ మెడికల్ షాప్ లో బీఫార్మన్స్ చెయ్యాని, వ్యక్తి తనకు తోచిన మందులిస్తూ గత కొన్ని రోజుల నుండి కాలం వెళ్లదీస్తున్నారు,. దీంతో వ్యక్తి ఇచ్చిన మందుల వల్ల అనేకమంది రోగులు నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు బోరున వెలిపిస్తున్నారు. ఇప్పటికైనా మెడికల్ షాప్ యజమాని తన మొండి వైఖరిని మార్చుకొని మెడికల్ షాప్ నడవాలంటే, బి ఫార్మసీ చేసిన వారిచే డాక్టర్ సలహా ప్రకారం పేద ప్రజలకు చికిత్స నిమిత్తం మందులు ఇవ్వాలని లేనిచో ఆసుపత్రి మూసివేయాలని లేనిచో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయా గ్రామాల రోగులు హెచ్చరిస్తున్నారు.

