📄 ePaper
Friday, July 24, 2026
📄 ePaper
Homeతెలంగాణమంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన కోటగిరి గౌడ సంఘం నాయకులు

మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన కోటగిరి గౌడ సంఘం నాయకులు

📰 Generate e-Paper Clip

మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన కోటగిరి గౌడ సంఘం నాయకులు

కోటగిరి, జులై 01(ప్రజాక్షేత్రం):రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ల ను కోటగిరి మండల గౌడ సంఘం నాయకులు, కోటగిరి మండలం గీత పనివాళ్ల సంఘం నాయకులు శాలువా పూల బొకేతో సన్మానించారు. మండలంలోని ఎత్తోండ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సంతాన రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం మండలానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోటగిరి మండల కేంద్రంలో గీత పనివాళ్ల సంఘం ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాలువా పూల బొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులతో మంత్రి పొన్నం పరిచయం చేసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత పని వాళ్ళ సంఘం రాష్ట్ర నాయకులు విట్టల్ గౌడ్,మండల అధ్యక్షుడు వెంకగౌడ్,కోటగిరి టీసీఎస్ ఛైర్మన్ శంకర్ గౌడ్, గౌడ సంఘం నాయకులు సాయిబాబా గౌడ్,శ్రీధర్ గౌడ్,భూమా గౌడ్,రమేష్ గౌడ్,మల్లేష్ గౌడ్,మొగులా గౌడ్,రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular