📄 ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeతెలంగాణ92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్

92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్

📰 Generate e-Paper Clip

92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్

92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల కేంద్రంగా వాక్య సిల్వర్

వాక్య సిల్వర్‌తో వెండి ఆభరణాలకు కొత్త చిరునామా

కాప్రా, జూలై 26(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ పరిధిలోని డా. ఏఎస్‌రావు నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాక్య సిల్వర్ జ్యూవెలరీ షోరూమ్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్. గణేష్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాల్లో ఆధునిక డిజైన్లతో పాటు నాణ్యతకు పెద్దపీట వేస్తూ వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విభిన్న కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రోజువారీ వినియోగం నుంచి వివాహాలు, పండుగలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని అవసరాలకు తగిన వెండి ఆభరణాలు, వెండి వస్తువులు ఒకేచోట లభించడం విశేషమన్నారు.
వాక్య సిల్వర్ యాజమాన్యం మాట్లాడుతూ, ప్రీమియం 92.5 స్టెర్లింగ్ సిల్వర్ ఆభరణాలతో పాటు అత్యుత్తమ నాణ్యత కలిగిన వెండి వస్తువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలి 50 మంది వినియోగదారులకు సిల్వర్ ఆభరణాలపై 50 శాతం తగ్గింపు, వెండి వస్తువుల మేకింగ్ ఛార్జీలపై 50 శాతం రాయితీ ప్రకటించినట్లు వెల్లడించారు. నాణ్యత, ఆధునిక డిజైన్లు, వినియోగదారుల విశ్వాసమే తమ ప్రధాన లక్ష్యమని యాజమాన్యం పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular