📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎంఐఎం

హైదరాబాద్ ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్ అన్వర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. మిర్జా రహ్మత్ బేగ్‌ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని వెంటనే శాసన మండలి చైర్మన్‌కు సమర్పించాలని ఆదేశించారు. నాలుగు రోజుల క్రితం అత్తాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని రహ్మత్ బేగ్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఈ ఆరోపణలే పార్టీ నిర్ణయానికి కారణమని ఎంఐఎం అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయనపై పార్టీ తీసుకున్న చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular