📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్గొట్లపల్లి గ్రామ శివారులో పేకాట..9 మంది పై కేసు నమోదు

గొట్లపల్లి గ్రామ శివారులో పేకాట..9 మంది పై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

గొట్లపల్లి గ్రామ శివారులో పేకాట..9 మంది పై కేసు నమోదు

  • పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి..
  • 9 మందిపై కేసు నమోదు…రూ.6,750 నగదు స్వాధీనం
  • నలుగురు అదుపులోకి.. పోలీసులను చూసి ఐదుగురు పరారీ
  • మొత్తం 9 మందిపై కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు
  • పేకాట, జూదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ హెచ్చరిక

పెద్దేముల్, ఆగస్టు 16(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామ శివారులోని మిత్ర సోలార్ ప్లాంట్ వెనుక వైపు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దేముల్ పోలీసులు దాడి నిర్వహించారు. పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ దాడి చేపట్టారు.

నలుగురు అదుపులోకి.. ఐదుగురు పరార్

పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి పేకాటకు వినియోగిస్తున్న రూ.6,750 నగదును స్వాధీనం చేసుకున్నారు.మరో ఐదుగురు వ్యక్తులు పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.

9 మందిపై కేసు నమోదు

ఈ ఘటనకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.పట్టుబడిన వ్యక్తులతో పాటు పరారైన వారి వివరాలను నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.పేకాట ఆడిన వారిలో మొత్తం 9 మంది అందులో పెద్దేముల్ మండలం పరిధిలోని గాజీపూర్ గ్రామానికి చెందిన జనుముల వెంకటప్ప,పెద్దేముల్ గ్రామానికి చెందిన పడగాళ్ళ ప్రేమ్ కుమార్, మారేపల్లి గ్రామానికి చెందిన చౌడాపూర్ చంద్రశేఖర్ రెడ్డి, గాజీపూర్ గ్రామానికి చెందిన కారుకొండ శ్రీనివాస్,పెద్దేముల్ గ్రామానికి చెందిన డి.చంద్రశేఖర్, పెద్దేముల్ గ్రామానికి చెందిన పూరుగుర్తి శ్రీకాంత్ రెడ్డి, తింసాన్ పల్లి గ్రామానికి చెందిన బంటు సంజీవ, బంట్వారం మండలం సల్ బత్తా పూర్ గ్రామానికి చెందిన అల్లాపురం కండయ్య, పెద్దేముల్ గ్రామానికి చెందిన మంగలి ప్రేమ్ కుమార్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పేకాట, జూదంపై ఉక్కుపాదం

పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పేకాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

పెద్దేముల్ పోలీసుల హెచ్చరిక

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు స్పష్టం చేశారు.ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular