📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణఘట్కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ఘట్కేసర్‌, ఆగస్టు 25(ప్రజాక్షేత్రం):మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్‌ మండలం కొండాపూర్‌లో విజ్ఞాన్‌ కళాశాల సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షిఫ్ట్‌ డిజైర్‌ కారు బైక్‌లను ఢీకొట్టడంతో విజ్ఞాన్‌ కళాశాలలో పనిచేస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడుపుతున్న డ్రైవర్‌ వేగంగా వచ్చి బైక్‌లను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular