ఘనంగా యాలాల మండలంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- పండుగ వాతావరణం లో వేడుకలు,
యాలాల ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):యాలాల మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం లో ఘనంగా జరిగాయి. తాహసిల్ ఆఫీస్ దగ్గర తాహసిల్దార్ గాయత్రి, ఠాణ ఎదుట ఎస్ఐ విట్టల్ రెడ్డి, ఎంపీడీవో ఎదురుగా శ్రీనిజ, పి హెచ్ సి ఎదుట వైద్యురాలు, రూబియా నాజ్, ఎంఆర్సి దగ్గర ఎంఈఓ మహిపాల్ రెడ్డి, బీసీ బాలుర హాస్టల్ దగ్గర వార్డెన్ బాలరాజు, ఎస్సీ హాస్టల్ దగ్గర వార్డెన్ జైపాల్ రెడ్డి, బీసీ బాలికల హాస్టల్ దగ్గర వార్డెన్ రజిని, సహకార సంఘం దగ్గర పిఎసిఎస్ చైర్మన్ జీ. సుందర్ రెడ్డి, ఐకెపి దగ్గర ఏపీఎం శ్రీనివాస్, బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు, దేశభక్తిని, చాటేలా నృత్యాలు, పాటలు ప్రదర్శించారు. గ్రామపంచాయతీ కార్యాలయాల దగ్గర సర్పంచులు, జాతీయ జెండా ను ఆవిష్కరించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అధ్యక్షులు కుర్వ మహిపాల్ యాదవ్, మండల బీఆర్ఎస్ పార్టీ దగ్గర మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, బిజెపి మండల పార్టీ దగ్గర ఆకుల శివకుమార్, మండల వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, యువత, విద్యావంతులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



