ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
- వికలాంగుల పక్షాన వారి సమస్యల కోసం ఎమ్మార్పీఎస్ ఉద్యమిస్తోంది.
వికారాబాద్ ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా నాయకులు విజయ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా జిల్లా ఇంచార్జి గట్టగల్ల ప్రశాంత్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ, జిల్లా నాయకులు రవి కుమార్ మాదిగ, వికలాంగుల నాయకులు నర్సింలు, విజయ్ పాల్గొని మాట్లాడుతూ 2007 ఆగస్ట్ 28న పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు వికలాంగుల సమస్యల కోసం వారి సంక్షేమం కోసం సమాజంలో వారికి సమాన గౌరవం కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంది అన్నారు అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ 6000వేలకి పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి దిగుతామని పిలుపునిచ్చారు. అనంతరం వి హెచ్ పి ఎస్ జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు నల్ల రాజు , నర్సింలు, లక్మి, కనకరావు, మల్లేశం ఎమ్మార్పీఎస్ నాయకుడు సుధాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ వికారాబాద్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాదిగ, మహిళ నాయకురాలు పుష్ప రాణి మాదిగ, సునీత, లక్ష్మీ, పద్మ రెడ్డి మర్తమ్మ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

