📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం

రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం

రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం

కాప్రా, ఆగస్టు 22(ప్రజాక్షేత్రం): తెలంగాణ సమాజానికి, హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి జయంతి సందర్భంగా రాధిక ఎక్స్‌రోడ్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ, విద్యాభివృద్ధి, సామాజిక సంక్షేమానికి వెంకట రామారెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి సేవలు, ఆదర్శాలను భావితరాలకు తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular