📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరెండోసారి బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గజ్వేల్ రామచంద్రం

రెండోసారి బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గజ్వేల్ రామచంద్రం

📰 Generate e-Paper Clip

రెండోసారి బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గజ్వేల్ రామచంద్రం

రాయపోల్ ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):బీజేపీ సిద్ధిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి నియమితులైన గజ్వేల్ రామచంద్రం పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి బాధ్యతలు అప్పగించిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు నత్తి శివ, రాయపోల్ మండల అధ్యక్షులు మంకిడి స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించి, అర్హులైన వారికి వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానన్నారు. సామాజిక న్యాయం, సమాజ సేవకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం అందిస్తున్న మార్గదర్శకత్వం, ఆశీస్సులను స్ఫూర్తిగా తీసుకుని ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని గజ్వేల్ రామచంద్రం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular