📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణగంజాయి నియంత్రణకు ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు

గంజాయి నియంత్రణకు ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు

📰 Generate e-Paper Clip

గంజాయి నియంత్రణకు ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు

నిర్మల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):కుబీర్ గజాయి ఇతర మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గంజాయి సేవిస్తున్నారా లేదా అనే విషయాన్ని క్షణాల్లో గుర్తించేలా పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక టెస్టింగ్‌ కిట్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులను ఈ కిట్ల ద్వారా పరీక్షించి అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వినియోగం ముఖ్యంగా యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎస్సై పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంతో పాటు కుటుంబ సామాజిక జీవితంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు సామాజిక సంస్థలు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీసు స్టేషన్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక టెస్టింగ్‌ కిట్లతో గంజాయి సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గంజాయి వినియోగంపై మరింత సమర్థవంతంగా నిఘా పెట్టేందుకు వీలవుతుందన్నారు. మండలంలోని అనుమానాస్పద ప్రాంతాలు, యువత ఎక్కువగా సంచరించే ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయాలు సరఫరా రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కృష్ణారెడ్డి హెచ్చరించారు. గంజాయి సేవించే వ్యక్తులకు కూడా కౌన్సెలింగ్‌తో పాటు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. మత్తుపదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతోనే మత్తుపదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై సూచించారు. గంజాయి రహిత సమాజం కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తారని యువతను మత్తుపదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular