📄 ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ

చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ

📰 Generate e-Paper Clip

చీకటి గోపి లాకప్ డెత్ కేసుపై ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మంద కృష్ణ మాదిగ

గుంటూరు సెప్టెంబర్ 22(ప్రజాక్షేత్రం):చీకటి గోపి లాకప్ డెత్ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దళిత, బహుజన ప్రజాసంఘాల ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ ని కలిశారు. ఈ సందర్భంగా చీకటి గోపి మృతి ఘటనకు సంబంధించిన అంశాలను ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్‌ను దళిత, బహుజన ప్రజాసంఘాలు స్వాగతిస్తున్నాయని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తెలిపారు. అయితే కేసులో నిజానిజాలు పూర్తిగా బయటకు రావాలంటే మృతదేహానికి ఎయిమ్స్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో రీ-పోస్టుమార్టం నిర్వహించాలని ఎస్సీ కమిషన్‌ను కోరారు. అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్. జవహర్ స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరారు. చీకటి గోపి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో బాధ్యులెవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, బహుజన ప్రజాసంఘాలు పోరాటాన్ని కొనసాగిస్తాయని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ ను కలిసినవారిలో దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విద్యా సాగర్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రి, ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ చైర్మన్ డా మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఎస్పి జాతీయ అధికార ప్రతినిధి డా వై కే విశ్వనాధ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా తది తరులు పాల్గొన్నారు మాదిగ, జై భీమ్ సేన సేవాదళ్ వ్యవస్థాపకులు నీలాంబరం, ఎంఎస్పి జాతీయ నాయకులు కూసిపూడి సత్యం మాదిగ తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular