📄 ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeజాతియంవివక్షత, అసమానతలు, పేదరిక నిర్మూలనకై ఉద్యమిస్తాం.

వివక్షత, అసమానతలు, పేదరిక నిర్మూలనకై ఉద్యమిస్తాం.

📰 Generate e-Paper Clip

  • మాకు రాజకీయంగా శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రువులు లేరు.
  • అక్టోబర్ 7 న అమరావతి లో 1200 మండల కమిటీల జాతీయ సదస్సు.
  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ‘పద్మశ్రీ’ మంద కృష్ణ మాదిగ.

హనుమకొండ సెప్టెంబర్ 09(ప్రజాక్షేత్రం):శతాబ్దాల తరబడి భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల, వర్గ, మత,లింగ, వివక్షతలను నిర్మూలించడం కోసం అలాగే సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలను తొలగించడానికై మరియు పేదరిక నిర్మూలన కోసం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో భవిష్యత్తు పోరాటాలు చేపడతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లాలో మడికొండ లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. ముందుగా మంద కృష్ణ మాదిగ కు గజమల వేసి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సభ ప్రాంగణంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ సదస్సును ఉద్దేశించి మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ “ఎస్సీ వర్గీకరణ కోసం చిన్న గ్రామంలో మొదలైన ఉద్యమం దేశాన్ని కదలించిందని అన్నారు. ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత ఉద్యమం విజయం సాధించిందని అన్నారు. ఫలితంగా నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలు ఇప్పుడిప్పుడే జాతికి అందుతూ విద్యా ఉద్యోగ రంగాల్లో ముందుకు సాగుతున్నామని అన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం కొనసాగించినప్పటికి సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులు వృద్దులు వితంతువుల కోసం పోరాడి వారి పెన్షన్ పెంచడానికి తోడ్పడి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావడం జరిగిందని అన్నారు. ఇకపై సమాజ ప్రయోజనాల కోసం విస్తృతంగా పోరాటం చేస్తామని అన్నారు. దేశంలో కుల వివక్షత తీవ్రంగా కొనసాగుతుందని అన్నారు.దళితులు ఉన్నత స్థాయిలోకి ఎదిగిన కూడా కులవివక్షతకు, అవమానాలకు గురి కాబడుతున్నారని అన్నారు. అందువల్లనే సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ దళితుడైన బిఆర్ గవాయి మీద బుట్లు విసిరి దాడి చేశారని అన్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు దళితుడైన మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ లో సభ పెట్టీ ప్రసంగిస్తే కొంత కుల ఉన్మాదులు ఆ సభ ప్రాంగణాన్ని పాలతో శుద్ధి చేశారు. ఇది ఘోరమైన అవమానం అని అన్నారు. అలాగే నిన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి కుల దురంహకర ఎమ్మెల్సీ ఘోరమైన పదం వాడి అవమనించాడని అన్నారు. ఇలాంటివి సహించరానివి అని అన్నారు. అందువల్ల దేశంలో కుల వివక్షత నిర్మూలన జరగాలని అన్నారు. కుల వ్యవస్థ రద్దు కావాలని అన్నారు. అందుకోసం భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని అన్నారు. అలాగే మత పరమైన విద్వేషాలు తొలగి పోవాలని, లింగ వివక్షత, వర్గ వివక్షత నిర్మూలం కావాలని అన్నారు. అలాగే పేదరికం తొలగిపోవాలని నేటికీ సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు తొలగిపోవాలని అన్నారు. మహనీయులు గౌతమ బుద్ధుడు నుండి మొదలుకొని అంబేద్కర్ వరకు మహనీయులు కలలు కన్న నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని అన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 7న అమరావతిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1200 మండలాల నూతన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కమిటీల జాతీయ సదస్సు నిర్వహించి ప్రతక్ష్య పోరాటాలకు సిద్ధం అవుతామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular