Homeతెలంగాణఅక్టోబర్ 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ.

అక్టోబర్ 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ.

📰 Generate e-Paper Clip

అక్టోబర్ 6న ఛలో ఉస్మానియా యూనివర్సిటీ.

  • MSF జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలి.
  • విద్యార్థి ఉద్యమాలు బలహీనంగా ఉన్నా ఈతరుణంలో విద్యార్థి లోకానికి నాయకత్వం వహించేలా MSF విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి.
  • ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగ విద్యార్ధి, నిరుద్యోగులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి.
  • కుల వివక్షత, పేదరికం, అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించేందుకు బలమైన ప్రజా పోరాటాలను కొనసాగిదాం.
  • MRPS రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ

హయత్ నగర్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):అక్టోబర్ 6న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో MSF జాతీయ ప్రతినిధుల మహాసభ నిర్వహిస్తున్నామని ఈమహాసభ విజయవంతం చేయడం కోసం మందకృష్ణ మాదిగ గారి పిలుపునందుకొని మాదిగ విద్యార్థులను శాస్త్రియంగా, సైద్ధాంతికంగా, నిర్మాణాతకంగా బలోపేతం చేసి నూతన కమిటీలను నిర్మాణం చేస్తూ విద్యార్థి ఉద్యమాన్ని శక్తివంతంగా తయారు చేయాలని MRPS రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. హయత్ నగర్ మండల కేంద్రంలోని సిటిజన్ కమ్యూనిటీ హాల్ నందు MRPS, MSP మరియు అనుబంధ విభాగాల జిల్లా సమీక్షా సమావేశం MRPS LB నగర్ నియోజకవర్గ ఇంచార్జి కొమ్ము రాజశేఖర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య ఆతిధిగా హాజరైన రాగల్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ…ఎస్సీ వర్గీకరణ సాధించడానికి ముప్పై ఏళ్ళు పోరాటం చేయాల్సి వచ్చిందని, అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని ,అందువల్ల వర్గీకరణ ఫలాలు వృథాగా పోకుండా చూసుకోవాలని అన్నారు. అందువల్ల విద్యా ,ఉద్యోగ రంగాల్లో ఎస్సీ వర్గీకరణ వల్ల వచ్చే 9% ఫలితాలను సంపూర్ణంగా అందుకునే విధంగా మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు తమ నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంచుకోవాలని, అన్ని రంగాల్లో ముందు వెళ్ళడానికి కావాల్సిన మేధస్సును, విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని అన్నారు.
విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం మీద బలమైన విద్యార్థి పోరాటాలు జరిగే పరిస్థితులు లేవని, ప్రస్తుతం విద్యార్థి ఉద్యమాలు బలహీనంగా ఉన్నా ఈతరుణంలో విద్యార్థి లోకానికి నాయకత్వం వహిస్తూ పలు ప్రజా పోరాటాలను నిర్మించేందుకు MSF విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్ని డిగ్రీ, పీజీ, జూనియర్ కళాశాలలో MSF నూతన కమిటీలను పునర్నిర్మానం చేయాలనీ కోరారు. కుల వివక్షత, పేదరికం, అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించేందుకు బలమైన ప్రజా పోరాటాలను కొనసాగించాలని అందుకు అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు సాగాలని, MRPS మరియు అనుబంధ విభాగాలను కమిటీలను పూర్తి చేసుకొని ఉద్యమాన్ని బలంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MSP మాజీ జిల్లా అధ్యక్షులు రావుగళ్ల బాబు మాదిగ, MRPS మాజీ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నర్సింహా మాదిగ, MSP LB నగర్ నియోజకవర్గ ఇంచార్జి ఎర్ర రవీందర్ మాదిగ, MSP రాష్ట్ర నాయకులు బత్తిని సుధాకర్ మాదిగ, శంకర్ రావు మాదిగ, రత్నం మాదిగ, చిట్టిబాబు మాదిగ, శామ్లెట్ గణేష్ మాదిగ, హేమంత్ గుప్త, కాడిగళ్ల ప్రవీణ్ మాదిగ, బ్యాతల శివ మాదిగ, MRPS నియోజకవర్గ కో ఇంచార్జి సతీష్ మాదిగ, హయత్ నగర్ అధ్యక్షులు శివ మాదిగ వివిధ మండలాల నాయకులు పాలొగొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular