మహిళా వార్డు మెంబర్ ఇంటిపై సర్పంచ్ దాడి
- గునపాలు, ఆయుధాలతో ఇల్లు ధ్వంసం.. మూడు రోజులుగా కేసు పరిశీలిస్తూనే ఉన్న పోలీసులు
- రాజి చేసుకోవాలని వత్తిడి, స్పందించని వ్యవస్థ
నవాబుపేట్ సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):నవాబుపేట్ మండలం, మాదిరెడ్డిపల్లిలో రాజకీయ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీకి చెందిన మహిళా వార్డు మెంబర్ ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ అనుచరులు గునపాలు, ఇతర ఆయుధాలతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో ఇంటి గేటు ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా కేసు నమోదు కాలేదని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేయకుండా రాజీ చేసుకోవాలని ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. దాడికి పాల్పడి, హత్యా ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరుతున్నారు. సర్పంచ్ కిష్టయ్య మరియు చాకలి రామచంద్రి మరియు కొంతమంది గ్రామస్తులుతో తమ కుటుంబాని ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. చంప డానికి వచ్చిన వ్యక్తులపై స్థానిక ఎస్ఐ ఉదాసీనంగా వ్యవహరిస్తు నింధితులపై కఠినమైన కేసులు పెట్టకుండా సాధారణ కేసులు పెట్టి కాపాడే యత్నం చేస్తున్నాడని బాధిత వార్డు మెంబర్ వెంకటమ్మ ఆరోపించారు. ఎస్ఐ తమను కాంప్రమైజ్ కావాలని వత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. ఉన్నతాధికారులు ఈవిషయంలో దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు బీజేపీ బిజేవైఎం యువమొర్చాలో క్రియాశీలకంగా పనిచేయడం సర్పంచ్ కి అతని వర్గం నాయకులకు కంట గింపుగా మారిందని అందువల్లనే కక్ష సాధింపు చర్యలకు దిగారని వారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు.

