తట్టేపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్ సింగ్
- పార్టీ బలోపేతానికి కృషి చేయాలి- నాయకుల సూచన
పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జాదవ్ ప్రేమ్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం మారేపల్లి గ్రామ సమీపంలోని సుమిత్రా కాటన్ మిల్లో నిర్వహించిన పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన నియామకాన్ని ప్రకటించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి సమక్షంలో జాదవ్ ప్రేమ్ సింగ్కు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గ్రామంలో పార్టీకి మరింత బలం చేకూర్చేందుకు కృషి చేయాలని జాదవ్ ప్రేమ్ సింగ్ను కోరారు.ఈ సందర్భంగా నూతన గ్రామ కమిటీ అధ్యక్షుడు జాదవ్ ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తట్టేపల్లి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

