Homeతెలంగాణదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు

📰 Generate e-Paper Clip

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు

  • విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపిన స్వాతంత్ర్య సమరయోధుడి త్యాగాన్ని స్మరించిన నాయకులు

పెద్దేముల్, సెప్టెంబర్ 29(ప్రజాక్షేత్రం):భారత స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు భగత్‌సింగ్‌ 119వ జయంతి వేడుకలను పెద్దేముల్ మండలంలో ఘనంగా నిర్వహించారు.స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులతో పాటు కేవీపీఎస్‌,అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కార్యక్రమంలో పాల్గొని భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్‌ మండల అధ్యక్షుడు కోళ్ల గోపాల్‌, మండల ప్రధాన కార్యదర్శి బక్కని రాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు బక్కని రమాకాంత్‌ లు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్‌ చేసిన పోరాటం, ఆయన చూపిన ధైర్యసాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ నినాదంతో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా భగత్‌సింగ్‌ ఉద్యమించారని గుర్తుచేశారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్‌సింగ్‌ తన సహచరులు రాజ్‌గురు, సుఖదేవ్‌లతో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు.1931 మార్చి 23న భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసిందని, చివరి క్షణాల్లోనూ వారు ధైర్యాన్ని కోల్పోకుండా దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు.లాలా లజపతిరాయ్‌పై జరిగిన లాఠీచార్జిలో ఆయన తీవ్రంగా గాయపడి అనంతరం మృతి చెందిన ఘటనకు ప్రతీకారంగా భగత్‌సింగ్‌,ఆయన సహచరులు బ్రిటిష్‌ పోలీసు అధికారి జేమ్స్‌ ఏ.స్కాట్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే పొరపాటున పోలీసు అధికారి జాన్‌ సాండర్స్‌ హతమయ్యాడు. అనంతరం భగత్‌సింగ్‌ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన విప్లవ కార్యకలాపాలను కొనసాగించారు. భగత్‌సింగ్‌ జీవితం, త్యాగం, దేశభక్తి భావాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ కరుణాకర్ రెడ్డి, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కేవీపీఎస్‌, అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular