Homeతెలంగాణదండోరా ఉద్యమకారుడు శివశంకర్ మాదిగకు ఎంఆర్పీఎస్ ఘన నివాళి

దండోరా ఉద్యమకారుడు శివశంకర్ మాదిగకు ఎంఆర్పీఎస్ ఘన నివాళి

📰 Generate e-Paper Clip

దండోరా ఉద్యమకారుడు శివశంకర్ మాదిగకు ఎంఆర్పీఎస్ ఘన నివాళి

  • బ్యాతాల శివశంకర్ మాదిగ మృతి ఉద్యమానికి తీరని లోటు
  • బాధిత కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం
  • కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకుల భరోసా

శంకర్‌పల్లి, అక్టోబర్ 09(ప్రజాక్షేత్రం):ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నిబద్ధతతో పనిచేసిన దండోరా ఉద్యమకారుడు, ఎంఆర్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి బ్యాతాల శివశంకర్ మాదిగ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ శుక్రవారం ఆయన స్వగ్రామమైన టంగటూరుకు చేరుకొని పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అంతిమయాత్రలో పాల్గొని శివశంకర్ మాదిగకు ఉద్యమ జోహార్లు అర్పించారు.

శివశంకర్ కుటుంబానికి రూ.40 వేల ఆర్థిక సాయం

ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన శివశంకర్ మాదిగ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు తమ వంతుగా విరాళాలు సేకరించి, తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.40 వేల ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అందుబాటులో లేకపోయినప్పటికీ, శివశంకర్ మరణవార్త తెలుసుకొని ఆయన తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు.

శివశంకర్ మరణం ఉద్యమానికి తీరని లోటు

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో టంగటూర్ కేంద్రంగా సాగిన దండోరా ఉద్యమంలో శివశంకర్ మాదిగ క్రియాశీలకంగా పనిచేశారని నాయకులు గుర్తుచేశారు. ఉద్యమ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను, నాయకులు, కార్యకర్తలతో ఆయనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. శివశంకర్ భౌతికంగా దూరమైనప్పటికీ, ఉద్యమంలో ఆయన చేసిన సేవలు, కలిసి నడిచిన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు రావుగాళ్ల బాబు మాదిగ, పెంటనోళ్ల నర్సింహా మాదిగ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ తో పాటు జాతీయ, రాష్ట్ర, మద్దిలేటి మాదిగ శంకర్ రావు మాదిగ, శంకర్ పల్లి మండల అధ్యక్షులు లింగం సాయి మాదిగ, శంకర్ పల్లి మున్సిపల్ అధ్యక్షులు కటికే మోహన్ మాదిగ వివిధ మండలాల అధ్యక్షులు జిల్లా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని శివశంకర్ మాదిగకు కడసారి నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular