ఇతరుల భవిష్యత్తును చెప్పే ప్రముఖ జ్యోతిషుడు ఇందు ప్రకాశ్ మిశ్రా భార్య స్మితా మిశ్రా UP MLC ఎన్నికల్లో ఓడిపోవడంపై నెట్టింట ట్రోల్స్ పేలుతున్నాయి. లక్నో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా స్మిత పోటీ చేశారు. మొత్తం 1,24,890 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఆమెకు 300 ఓట్లు కూడా రాలేదు. దీంతో ‘నీ భార్య భవిష్యత్తును చూడలేదా’, ‘సొంత భార్య ఫ్యూచర్ పసిగట్టలేకపోయాడు’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

