Homeతెలంగాణనవంబర్ నుంచి విద్యుత్ బిల్లులపై అదనపు భారం

నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులపై అదనపు భారం

📰 Generate e-Paper Clip

  • ఈ నెల యూనిట్‌కు 30 పైసలు.. డిసెంబర్ నుంచి 50 పైసలు.

హైదరాబాద్ నవంబర్ 04(ప్రజాక్షేత్రం):తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల రూపంలో అదనపు భారం ప్రారంభం కానుంది. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) అనుమతితో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన అదనపు వ్యయాలను భర్తీ చేసేందుకు ఈ వసూళ్లు చేపడుతున్నారు. మొత్తం రూ.7,635 కోట్లలో రూ.5,420 కోట్లను వ్యవసాయేతర వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మిగిలిన భారాన్ని ప్రభుత్వం భరించనుంది. నవంబర్ నెలలో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసలు చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో 29 నెలలు, ఉత్తర డిస్కం పరిధిలో 26 నెలలపాటు ఈ వసూళ్లు కొనసాగనున్నాయి. అయితే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే అర్హులైన వినియోగదారులకు ఈ భారం ఉండదని సమాచారం. వినియోగదారులు తమ బిల్లుల్లో ట్రూ అప్ ఛార్జీల వివరాలను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular