- సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసిన భీమ్ భరత్
చేవెళ్ల నవంబర్ 08(ప్రజాక్షేత్రం):నవాబ్‌పేట్ మండలం, శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలు, వార్డుల్లో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలు జరుపుకున్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరి సతీష్, నవాబ్‌పేట్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, ఎల్లకొండ సర్పంచ్ కొండల్ యాదవ్, సంజీవ రెడ్డి, శ్రీధర్, సర్పంచులు అనంత రాములు, నర్సింలు, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, ప్రసాద్, శేఖర్ పాల్గొన్నారు. అలాగే శంకర్పల్లి మండల నాయకులు, డైరెక్టర్ రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్, ఏజాజ్, బద్దం కృష్ణారెడ్డి, సమీ, మైసయ్య, ప్రశాంత్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



