- సొంతింట్లో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్న లబ్ధిదారులు
శంకర్ పల్లి నవంబర్ 08(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంతింట్లో దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శంకర్‌పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇందిరమ్మ ఇంటి ముందు దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు చేసుకున్నారు. సొంతింటి కల నెరవేరిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు యాప్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపావళి ఆనందాన్ని పంచుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి మండల ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, గ్రామ కార్యదర్శి రియాజ్, గ్రామ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సీతారాం రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

