📄 ePaper
Saturday, July 25, 2026
📄 ePaper
Homeతెలంగాణసేవా స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం భుంపల్లి సాయికిరణ్

సేవా స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం భుంపల్లి సాయికిరణ్

📰 Generate e-Paper Clip

నిర్మల్ జిల్లా ప్రతినిధి జూన్ 13(ప్రజాక్షేత్రం):భైంసా మండలం దేగాం గ్రామంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షం కారణంగా గ్రామంలోని జీపీ నల్లా కింద డ్రైనేజీ జామ్ కావడంతో వర్షపు నీరు నిలిచిపోయి ఎస్సీ కాలోనీ వాసులు కొంత సేపు ఇబ్బందీని ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిని గమనించిన భుంపల్లి సాయికిరణ్ ఎలాంటి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి, కురుస్తున్న వర్షంలోనే డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా జరిగేలా శ్రమించాడు. వర్షంలో తడుస్తూనే ప్రజల సమస్యను తన సమస్యగా భావించి చేసిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయం సాయికిరణ్ చూపిన సామాజిక బాధ్యత, సేవా తత్వం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఈ దృశ్యాన్ని గమనించిన జర్నలిస్టు ప్రవీణ్ రాచర్ల యువకుడు సాయికిరణ్‌ ను అభినందిస్తూ, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే ఇటువంటి యువత వల్లే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో యువత చురుకుగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular