📄 ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలను శ్రీనివాస్ రెడ్డి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలను శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొలను శ్రీనివాస్ రెడ్డి

  • మాజీ సర్పంచ్‌పై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

చౌటుప్పల్, జులై 23(ప్రజాక్షేత్రం):చౌటుప్పల్ మండలం అల్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితుడు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో గ్రామసభ వద్ద కొలను శ్రీనివాస్ రెడ్డి ఉండగా, గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు ఆయనపై అకారణంగా బూతులతో దాడి చేసి కొట్టారని తెలిపారు. పాత కక్షలతోనే తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన తనపై ఈ విధంగా దాడికి పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి, చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular