📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడులు..!

దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడులు..!

📰 Generate e-Paper Clip

దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి..!

  • 15 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్..?
  • 9 బైకులు,రూ.50,040 నగదు,16 సెల్ ఫోన్లు స్వాధీనం..?

కోటగిరి, జులై 31(ప్రజాక్షేత్రం):కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతంగల్ మండల కేంద్రంలో గల ఓ దాబాలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 15 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయగా వారి వద్ద నుండి రూ.50,040 నగదును 9 బైకులను 16 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కోటగిరి పోలీసులకు సమాచారం అందించి వారిని పోలీసులకు అప్పజెప్పారు. కాగా కోటగిరి పోతంగల్ మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉన్న దాబాలో దర్జాగా పేకాట స్థావరం నిర్వహించడం ఈ స్థావరంపై సిపి ఏర్పాటు చేసిన ప్రత్యేక టీం చీతా ఫోర్స్ దాడులు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ దాబాలో నిత్యం పేకాట కొనసాగుతున్నప్పటికీ స్థానిక పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గత నెల రోజుల్లో కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చీతా ఫోర్స్ దాడులు చేయటం ఇది రెండవసారి కావడం తో స్థానిక పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా పేకాట స్థావరాలు కొనసాగుతున్నప్పటికీ ఎందుకు పోలీసులు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న దాబాలో విచ్చలవిడిగా మద్యం సేవించడంతోపాటు పేకాట స్థాపరాన్ని నిర్వహించడం పై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. చీతా ఫోర్స్ దాడుల్లో ఏకంగా 15 మంది పేకాటరాళ్లు పట్టుబడడం స్థానికంగా సంచలనంగా మారింది. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడగా ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరాల పై ప్రత్యేక శ్రద్ధ వహించి జూదానికి బలవుతున్న కుటుంబాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular