📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఎస్ ఐ ఆర్ ప్రక్రియ గడువు పొడగింపు

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ గడువు పొడగింపు

📰 Generate e-Paper Clip

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ గడువు పొడగింపు

  • ఆగస్టు 10 వరకు ఓటరు నమోదు చేసుకునే అవకాశం,
  • నియోజకవర్గం లో ఇప్పటివరకు 2,52,235 ఓట్లు,
  • అర్హత సాధించినవి కలుపుకొని 2, 29, 102 మంది ఓట్లు,
  • 90.83 శాతం మంది ఎస్ ఐ ఆర్ ప్రక్రియ లో డిజిటలైజేషన్ లో తమ ఓటు నమోదు పూర్తి,
  • కాంగ్రెస్ పార్టీ ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు.

యాలాల ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):ఎస్ ఐ ఆర్ గడువు పొడిగింపు చేసి, ఆగస్టు 10 వరకు ఓటరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారని కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఎస్ ఐ ఆర్ కరణం పురుషోత్తం రావు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 100% ప్రక్రియ పూర్తి అయినా పోలింగ్ స్టేషన్స్ 73 ఉన్నాయి అని తెలిపారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియ గడువును ఆగస్టు 10, 2026 పొడిగించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం తెలిపారు. తాండూరు నియోజకవర్గం లో ఇప్పటివరకు 2,52,235 ఓటర్లు గాను చనిపోయిన, ఓటరు బదిలీ, గుర్తించని ఓట్లు తో పాటు అర్హత సాధించినవి కలుపుకొని 2, 29,102 మంది ఓటర్లు, ఉన్నట్టు పేర్కొన్నారు. 90.83 శాతం మంది ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో డిజిటైలైజేషన్ లో తమ ఓటు నమోదు పూర్తి చేసుకున్నారని అన్నారు. దీనితోపాటు మిగిలిపోయిన 23, 133 ఓట్లు నేటి వరకు సర్ ప్రక్రియలో పాల్గొనలేదని కరణం పురుషోత్తం రావు వెల్లడించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని 269 మంది బూత్ లెవెల్ ఏజెంట్లు ( బి ఎల్ ఎ) కు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రతి బిఎల్ఎ తమకు కేటాయించిన బూత్ పరిధిలో ఇంకా నమోదు చేసుకొని అర్హులైన ఓటర్లను వ్యక్తిగతంగా సంప్రదించి, అవసరమైన పత్రాలతో వారి నమోదు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయించాలని కోరారు. ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా ఓటరు జాబితా మినయించబడకుండా ప్రతి ఇంటిని సందర్శించి, పెండింగ్లో ఉన్న నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని 269 మంది బి ఎల్ ఏ లు, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్స్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి 100% సాధించాలన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ ఐ ఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తమరావు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular