📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణశ్రీశ్రీశ్రీ నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవ కార్యక్రమం

శ్రీశ్రీశ్రీ నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

శ్రీ శ్రీ శ్రీ నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవ కార్యక్రమం

జహీరాబాద్ ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి పండుగను అత్యంత శ్రద్ధ భక్తితో భక్తులు జరుపుకుంటారు. ఇది కేవలం పాములకు పాలు పోసి ఆచారమే కాకుండా ప్రకృతిని భూమిలోని జీవశక్తిని గౌరవించాలని బోధిస్తుంది. క్షమ… సమతుల్యత… మనలోని కోపం, అహంకారం వంటి విషపు ఆలోచనలను అణిచివేయాలని సందేశం ఇస్తుంది. పూజలో పాలు శాంతికి … బెల్లం మధురత్వానికి … కొబ్బరికాయ స్వచ్ఛతకు… వడపప్పు సరళతుకు… ప్రత్యేకగా ఉంటాయని నాగుల పంచమి పండుగను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ సిద్దు రావణ్ అన్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో నూతన నాగేశ్వర మందిర ప్రారంభ మహోత్సవం శ్రీ శ్రీ మానసా దేవి మందిరం దగ్గర అత్యంత వైభవంగా జరిగింది గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ముఖ్యఅతిథి సిద్దు రావణ్ ని సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర భీమ్ ఆర్మీ చీఫ్ మరియు శాంతి ఫౌండేషన్ చైర్మన్ సిద్దు రావణ్ గ్రామ సర్పంచ్, భీమ్ ఆర్మీ నాయకులు బాలరాజు, నరసింహ, ధనరాజ్, రాహుల్, రవీందర్ గ్రామ సర్పంచ్ రవి పెద్దలు యువకులు అనంతరం, అశోక్, శ్రీనివాస్ సదానంద్, శ్రీకాంత్, సుభాష్ గోపాల్, శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular