గ్రామ కమిటీల ఏర్పాటు తో కాంగ్రెస్ పార్టీలో నయా జోష్
- పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఏర్పాటు
- నూతన అధ్యక్షులకు అభినందనలు తెలిపిన పార్టీ నాయకులు
- గ్రామస్థాయిలో కాంగ్రెస్ కు మరింత బలం
- జోరుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు ఏర్పాటు
పెద్దేముల్, ఆగస్టు 19(ప్రజాక్షేత్రం):పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని బాయిమీది తండా, ఊరేంటి తాండ, అడికిచర్ల, పాషాపూర్, జయరామ్ తాండ (ఓ), ఓమ్లా నాయక్ తాండ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఎన్నికను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీ అధ్యక్షులకు సూచించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
అనంతరం బాయిమీద తండా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చవాన్ విఠల్, ఊరేంటి తాండ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాథోడ్ కుమార్, అడికి చెర్ల పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాథోడ్ రమేష్, పాషాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా హీరాలాల్, జయరాం తండా( ఓ )గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎం.సునీల్ కుమార్,ఓమ్లా నాయక్ తండా గ్రామ కమిటీ అధ్యక్షుడుగా చవాన్ బన్సీలాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులను ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిని శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల ప్రవీణ్ కుమార్ గుప్తా, ఉప్పరి మల్లేశం, లొంక నర్సింహులు, నారాయణ గౌడ్, రియాజ్, మహిళా నేత సుమిత్రా రాథోడ్, వెంకట్ రెడ్డి, శివరాం, తట్టేపల్లి జగన్, బాబు సింగ్, కే.గోపాల్, శంకర్ నాయక్, గాజీపూర్ నసీరోద్దీన్, పట్లోళ్ల లాల్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లక్ష్మణ్, తట్టేపల్లి కే.నర్సింహులు, మాంబాపూర్ శ్రావణ్ కుమార్, హర్ష వర్ధన్ రెడ్డి, జోగు హన్మంతు, కిష్టప్ప, రాంశెట్టి, సాబెర్, ఆనందం, అంబు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.


